ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బాబోయ్​ పాములు..ఆందోళనలో ప్రజలు - vijayawada

వరస పాముకాట్లతో నూజివీడు పరిసర ప్రాంత వాసులు భయాందోళనకు గురవుతున్నారు.

పాముకాట్లు

By

Published : Sep 8, 2019, 4:38 PM IST

వరస పాముకాట్లతో ప్రజలు బెంబేలు

కృష్ణాజిల్లా నూజివీడు రెవెన్యూ డివిజన్ పరిధిలోని పలు గ్రామాల్లో వరుస పాముకాట్లు ప్రజలను భయపెడుతూనే ఉన్నాయి. ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న ఆందోళన అందరినీ వెంటాడుతోంది. తాజాగా సిద్ధార్థనగర్​కు చెందిన గుగులోతు నాగులు పొలం పనులు చూసుకుని తిరిగి వస్తుండగా పాము కాటుతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే ఆస్పత్రికి తరలించటంతో ప్రాణాపాయ స్థితినుంచి బయటపడ్డాడు. గడిచిన మూడు రోజులుగా ముగ్గురు పాముకాట్లకు గురైనట్లు వైద్యులు అనిల్ కుమార్ తెలిపారు.గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా పాముల సంచారంతో ప్రజలు ఇంటినుంచి బయటకువచ్చేందుకు భయపడుతున్నారు. అధికారులు తగిన జాగ్రత్త చర్యలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details