వెండి ఆభరణాలను తరలిస్తున్న ముఠా గుట్టు రట్టు - silver
విజయవాడలో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న వెండి ఆభరణాల అక్రమరవాణా ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నై నుంచి విజయవాడకు లక్షల రూపాయల విలువ చేసే ఆభరణాలను బిల్లులు లేకుండా తరలిస్తున్న సమచారంతో పోలీసులు పట్టుకున్నారు.
వెండి ఆభరణాలను తరలిస్తున్న ముఠా గుట్టు రట్టు
చెన్నై నుంచి విజయవాడకు అక్రమంగా తరలిస్తున్న వెండి ఆభరణాలను పోలీసులు పట్టుకున్నారు. ఓ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 52 లక్షల 44 వేల రూపాయల విలువ చేసే వెండి ఆభరణాలను, రూ. 3.65 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎటువంటి బిల్లులు లేకుండా రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తమిళనాడుకు చెందిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నారు.