ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఇది వేలంపాట... మీ ఆట కాదు..!

By

Published : Nov 28, 2019, 10:32 PM IST

కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ దేవాలయంలో... దుకాణాల నిర్వహణ వేలం పాటలో గందరగోళం నెలకొంది. ఆలయ అధికారులు కొందరు వ్యాపారుల పట్ల పక్షపాత ధోరణితో వ్యవహరించారని... దుకాణదారులు ఆరోపించారు. అనంతరం వేలంపాటను వాయిదా వేశారు.

Shoppers worry that the auction may not be done properly at sri thirupathamma temple, krishna district
పెనుగంచిప్రోలు శ్రీ తిరుతమ్మ దేవాలయ వేలంపాటలో ఆందోళన

ఇది వేలంపాట... మీ ఆట కాదు..!

కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ దేవాలయంలో... దుకాణాల నిర్వహణ వేలంపాటలో గందరగోళం నెలకొంది. 50 దుకాణాలకు వేలంపాట చేపట్టగా... 30 దుకాణాలకు పూర్తి చేశారు. ఈ ప్రక్రియలో ఆలయ అధికారులు కొందరు వ్యాపారుల పట్ల పక్షపాత ధోరణితో వ్యవహరించారని దుకాణదారులు ఆరోపించారు. కావాలని కొన్ని దుకాణాలకు ధర తగ్గించి, మరికొన్నింటికి పెంచారన్నారు. ఈ సంఘటనతో అధికారులు వేలం నిలిపి వేశారు.

పెనుగంచిప్రోలులో తెదేపా, వైకాపా పార్టీలకు చెందిన నాయకులు ఆలయం వద్దకు చేరుకున్నారు. తమ వర్గీయులు నిర్వహించుకునే దుకాణాలకు ఎందుకు అధిక ధరలు కోడ్ చేస్తున్నారని తెదేపా నాయకులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. చేసేదేం లేక వేలంపాటలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అధికారులు మాత్రం అలాంటిదేమి లేదంటూ సమాధానమిచ్చారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details