కృష్ణా జిల్లా ఘంటసాల పెద్దగూడెం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దేవరపల్లి అంకినీడు కొత్తగా ఇంటిని నిర్మించుకుని... గృహ ప్రవేశం కార్యక్రమం జరుపుకుంటున్నాడు. అప్పటిదాకా కొత్త ఇంట్లో బంధువులతో సరదాగా గడిపిన అంకినీడు... విద్యుదాఘాతంతో ఒక్కసారిగాకుప్పకూలిపోయాడు. దీంతో కుటుంబసభ్యులు క్షతగాత్రున్ని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. ఈ ఘటనతో కుటుంబంలో, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
అప్పటి వరకు కలియతిరిగాడు... అంతలోనే కానరాని లోకాలకు వెళ్లిపోయాడు.... - current shock
ఆ ఇంట్లో ఆనందంగా శుభకార్యం జరుగుతున్న సమయంలో అపశృతి చోటుచేసుకుంది. అప్పటివరకు బంధువులతో కలియతిరిగిన వ్యక్తి అకస్మాత్తుగా మృత్యు ఒడిలోకి చేరితే ఆ బాధ వర్ణణాతీతం. అలాంటి ఘటనే కృష్ణా జిల్లా ఘంటసాల పెద్దగూడెం గ్రామంలో జరిగింది.
కరెంట్ షాక్తో మృతి చెందిన అంకినీడు