కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి సమీపంలో పొలం పనికి వెళ్లిన ఓ మహిళపై సమీప బంధువు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనను అడ్డుకోబోయిన వారిని బెదిరించాడని బాధితురాలు పేర్కొన్నారు. తనపై అత్యాచారం జరిగినట్లు వీరవల్లి పోలీస్స్టేషన్లో బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ.సుబ్రహ్మణ్యం తెలిపారు. వైద్య పరీక్షలు నిమిత్తం మహిళను నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పొలం పనికి వెళ్లిన మహిళపై అత్యాచారం.. సమీప బంధువే నిందితుడు - sexual harassment on woman in veeravalli
కృష్ణా జిల్లా మల్లవల్లిలో ఓ మహిళపై సమీప బంధువు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలు వీరవల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మహిళపై అత్యాచారం... నిందితుడు ఎవరంటే..