ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెలంగాణ: శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత - ఇద్దరు ప్రయాణికుల వద్ద నుంచి గోల్డ్​ను స్వాధీనం

బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు ముఠాలు రకారకాలుగా ప్రయత్నాలు చేస్తూ దొరికిపోతున్నారు. తెలంగాణలోని శంషాబాద్ విమానాశ్రయంలో ఇద్దరు వ్యక్తులు ప్యాంటు నడుము పట్టిలో బంగారాన్ని పెట్టుకున్నట్లు అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత
శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత

By

Published : Nov 26, 2020, 5:04 PM IST

బంగారాన్ని అక్రమంగా తరలించే ముఠాలు రకరకాలుగా బంగారాన్ని తరలించే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో చాక్లెట్లు, బిస్కెట్లు, పల్లి కాయాలు, ద్రవ రూపం, ఇలా అనేక విధాలుగా బంగారాన్ని తరలిస్తూ దొరికిపోయారు. తాజాగా శంషాబాద్ విమానాశ్రయంలో బంగారాన్ని వారి ప్యాంటు నడుము పట్టీలో దాచి తరలిస్తుండగా.. అధికారులు గుర్తించి వారిని పట్టుకున్నారు.

రియాద్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల వద్ద నుంచి బంగారం స్వాధీనం చేసుకున్నారు. రూ.18.07 లక్షల విలువైన 369.8 గ్రాముల పుత్తడి అక్రమ రవాణాపై కస్టమ్స్ అధికారులు రెండు కేసులు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details