కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలో ఎస్ఈబీ స్టేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఉంగుటూరు మండలం పొట్టిపాడు టోల్ గేట్ వద్ద అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నారు. విజయనగరం నుంచి దిల్లీకి ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులతో వెళ్తున్న కారును పోలీసులు తనిఖీ చేయగా.. అందులో రూ.7 లక్షల విలువ చేసే 77 కేజీల గంజాయి ఉంది. దాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురిని అరెస్టు చేశారు. నిందితుల్లో ఇద్దరు విజయవాడకు చెందిన వారు కాగా.. మరో ముగ్గురు దిల్లీకి చెందిన వ్యక్తులుగా గుర్తించినట్లు ఎస్ఈబీ ఏఎస్పీ మోకా సత్తిబాబు వెల్లడించారు.
రూ.7 లక్షల విలువగల 77 కిలోల గంజాయి పట్టివేత - కృష్ణా జిల్లా వార్తలు
ఉంగుటూరు మండలం పొట్టిపాడు టోల్‌గేట్ వద్ద రూ.7 లక్షల విలువగల 77 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. గంజాయిని తరలిస్తున్న కారును స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురిని అరెస్టు చేశారు.
గంజాయి