ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నూజివీడు ట్రిపుల్​ ఐటీలో రెండో విడత కౌన్సిలింగ్

కృష్ణాజిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో 2వ విడత కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం అయినట్లు రాజీవ్ గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం ఛాన్సలర్ కేసీ రెడ్డి తెలిపారు. వచ్చే నెల 4వ తేదీ నుంచి కొత్తగా చేరే విద్యార్థులకు తరగతులు ప్రారంభం కానున్నట్లు పేర్కోన్నారు.

By

Published : Aug 27, 2019, 12:27 AM IST

Published : Aug 27, 2019, 12:27 AM IST

నూజివీడు త్రిపుల్​ ఐటీలో రెండో విడత కౌన్సిలింగ్

నూజివీడు త్రిపుల్​ ఐటీలో రెండో విడత కౌన్సిలింగ్

కృష్ణాజిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో 2వ విడత కౌన్సిలింగ్ ను ప్రారంభించారు. శ్రీకాకుళం, ఒంగోలు, ఆర్కే వ్యాలీ త్రిపుల్ ఐటీ కౌన్సిలింగ్ ప్రక్రియ నూజివీడు లోనే కొనసాగుతోందని రాజీవ్ గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం ఛాన్సలర్ కేసీ రెడ్డి తెలిపారు. ఈబీసీఎస్, స్పోర్ట్స్, వికలాంగుల కోటాలన్నీ కలిపి 400 పై గల సీట్ల భర్తీ కోసం సుమారు 500 మంది విద్యార్థులను కౌన్సిలింగ్ కు ఆహ్వానించామన్నారు. శ్రీకాకుళంలో ల్యాబ్, ఇతర సౌకర్యాలను వేగవంతంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. కొత్తగా చేరిన విద్యార్థులను శ్రీకాకుళం పంపుతున్నామన్నారు. అనంతరం కౌన్సిలింగ్​ లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు గుర్తింపుకార్డులను అందించారు.

ABOUT THE AUTHOR

...view details