ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత - కృష్ణా జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత

మద్యం అక్రమ రవాణాపై అధికారులు దృష్టిపెట్టారు. ఎస్​ఈబీ అధికారుల తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న మద్యం బయటపడుతోంది. కృష్ణాజిల్లాలో పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించిన అధికారులు 608 మధ్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. 12 మందిని అదుపులోకి తీసుకున్నారు.

seb raids
seb raids

By

Published : Jul 28, 2020, 8:51 AM IST

కృష్ణాజిల్లాలో ఎస్ఈబీ అధికారులు తనిఖీల్లో.. అక్రమంగా తరలిస్తున్న మద్యం బయటపడింది. భవానీపురం, నున్న, టూటౌన్, గన్నవరం, తోట్లవల్లూరులో 608 మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు అక్రమంగా తరలిస్తున్న 7కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 12 మంది అదుపులోకి తీసుకున్నారు. తోట్లవల్లూరులో ట్రాక్టర్లలో అక్రమంగా తరలిస్తున్న 6 టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details