కృష్ణాజిల్లా గన్నవరం మండలం సావరగూడెంలో నిర్మించాలనుకుంటున్న డంపింగ్ యార్డ్ వద్దంటూ నెలరోజులుగా స్థానికులు ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో గన్నవరం ఎంపీడీవో అంకమ రావు ఆధ్వర్యంలో అధికారులు గ్రామ సమీపంలోని డంపింగ్ యార్డ్ నిర్మించ తలపెట్టిన ప్రదేశాన్ని పరిశీలించారు. అధికారుల రాకతో గ్రామస్తులు మరోసారి తమ నిరసన గళాన్ని విప్పారు. గ్రామానికి కేవలం వంద మీటర్ల దూరంలోనే డంపింగ్ యార్డు స్థలం ఉందని... రెవెన్యూ అధికారులు మాత్రం 3కిలో మీటర్లకు పైగా ఉందని నివేదిక ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి వెంటనే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
'డంపింగ్ యార్డ్ వద్దంటూ సావర్లగూడెం గ్రామస్తుల ఆందోళన' - dumping yard
డంపింగ్ యార్డ్ గ్రామంలో నిర్మించవద్దు అంటూ సావరగూడెం గ్రామస్తులు మరోసారి ఆందోళన చేశారు. డంపింగ్ యార్డ్ స్థలాన్ని ఎంపీడీవో పరిశీలించారు. అధికారుల ముందు మరోసారి నిరసన వ్యక్తం చేశారు.
'డంపింగ్ యార్డ్ వద్దంటూ సావర్లగూడెం గ్రామస్తుల ఆందోళన'