అక్కడ ఇసుక తవ్వకాలకు అనుమతి - క్యూ కట్టిన ట్రాక్టర్లు - thavvakalu
ఇసుక కొరతతో భవన నిర్మాణాలు ఆగిపోయాయి. దీంతో అధికారులు చర్యలు చేపట్టారు. కృష్ణాజిల్లా నార్తువల్లూరు క్వారీలోని 11 ఎకరాల్లో ఇసుక తవ్వకాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ట్రాక్టర్ లోడింగ్ ఛార్జి రూ.300, రహదారి ఖర్చుకింద రూ. 30 రెవెన్యూ సిబ్బందికి చెల్లించి ఇసుక తీసుకెళ్తున్నారు.
ఇసుక విధానం ప్రకటించడంతో ...అన్ని చోట్లా ఇసుక తవ్వకాలు ఆగిపోయాయి. అధికారులు సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు. కృష్ణాజిల్లా నార్తువల్లూరు క్వారీలోని 11 ఎకరాల్లో ఇసుక తవ్వకాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో జిల్లానలుమూలల నుంచి.. ట్రాక్టర్లతో ఇసుకను తీసుకెళ్తున్నారు. ఇసుక ఉచితంగా ఇస్తుండటంతో ...అవనిగడ్డ రహదారికి ఇరువైపులా కిలోమీటర్ల మేర ట్రాక్టర్లు నిలిచిపోయాయి. రోడ్డునుంచి క్వారీకి 3 కిలోమీటర్లమేర వాహనాలు ఇలా బారులుతీరీ కనిపిస్తున్నాయి.