విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ శాకంబరీ ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. పూర్ణాహుతితో వేడుకలను ముగించినట్లు ఆలయ వర్గాలు ప్రకటించాయి. కరోనా కారణంగా ఈ ఏడాది ప్రభుత్వ నిబంధనల మేరకు ఉత్సవాలు నిర్వహించినట్లు దుర్గ గుడి ఛైర్మన్ పైలా సోమినాయుడు తెలిపారు.
వైభవంగా ముగిసిన కనకదుర్గమ్మ శాకంబరీ ఉత్సవాలు - విజయవాడ దుర్గ గుడిలో శాకంబరీ ఉత్సవాల వార్తలు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ శాకంబరీ ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. చివరిరోజైన ఆదివారం 8 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. కరోనా కారణంగా ఈ ఏడాది ప్రభుత్వ నిబంధనల మేరకు ఉత్సవాలు నిర్వహించినట్లు దుర్గ గుడి ఛైర్మన్ పైలా సోమినాయుడు తెలిపారు.
వైభవంగా ముగిసిన కనకదుర్గమ్మ శాకంబరీ ఉత్సవాలు
ఈసారి ఉత్సవాల్లో 9,500 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు ఛైర్మన్ వెల్లడించారు. చివరి రోజైన ఆదివారం ఒక్కరోజే 8 వేల మంది అమ్మవారి దర్శనార్ధం వచ్చినట్లు తెలిపారు. పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు దుర్గమ్మను దర్శించుకున్నారు. కొవిడ్ తరుణంలో అన్ని ఏర్పాట్లు పక్కాగా చేసినట్లు వివరించారు. ఉత్సవాల సందర్భంగా 30 టన్నుల కూరగాయలు, పండ్లతో ఆలయాన్ని అలంకరించినట్లు చెప్పారు.
ఇవీ చదవండి...
'కరోనా పరీక్షల్లో దేశంలోనే అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్'