ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దసరా స్పెషల్:​ సరిహద్దుల్లో బస్సులు... ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు - RTC latest news updates

తెలుగురాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు తిరగకపోవటంతో అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. దసరా రద్దీని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర సరిహద్దుల వరకు బస్సులు నడిచేలా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి సరిహద్దులకు సర్వీసులు నడుపుతామని స్పష్టం చేశారు.

విజయవాడ జోనల్ ఈడీ వెంకటేశ్వరరావు
కుదరని సయోధ్యతో ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు

By

Published : Oct 24, 2020, 2:40 PM IST

తెలుగు రాష్ట్రాల రవాణా మంత్రులు, అధికారుల మధ్య నాలుగో విడత చర్చలు విఫలం కావడంతో ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర సరిహద్దుల వరకు బస్సులు నడిపేందుకు రంగం సిద్ధం చేశామని విజయవాడ జోనల్ ఈడీ వెంకటేశ్వరరావు తెలిపారు. ప్రయాణికుల సౌలభ్యం కోసం ఈ ఏర్పాట్లు చేశామని...రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి విజయవాడకు బస్సులు ఏర్పాటు చేశామన్నారు. విజయవాడ నుంచి గరికపాడు వరకు, గుంటూరు, పశ్చిమగోదారి జిల్లాల్లోని సరిహద్దుల వరకు సర్వీసులు నడిచేలా ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details