సంక్రాంతి పండుగ: ప్రయాణికులతో కిక్కిరిసిన రహదారులు - Roads crowded with commuters for sankranthi festival
సంక్రాంతి పండగొచ్చింది..పట్నం పల్లెబాట పట్టింది. కృష్ణా జిల్లాలోని గన్నవరం సమీపంలోని పొట్టిపాడు టోల్గేట్ వద్ద వాహనాల సంఖ్య పెరిగింది. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల నుంచి సొంతూళ్లకు వెళ్తుండటంతో టోల్ గేట్ల వద్ద వాహనాల రద్దీ నెలకొంది.
సంక్రాంతి పండగ సందర్భంగా రహదారులపై రద్దీ గణనీయంగా పెరిగింది. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల నుంచి సొంతూళ్లకు వెళ్తుండటంతో టోల్ గేట్ల వద్ద రద్దీ నెలకొంది. కృష్ణా జిల్లాలోని గన్నవరం సమీపంలోని పొట్టిపాడు టోల్గేట్ వద్ద వాహనాల సంఖ్య పెరిగింది. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలో ఏర్పాటు చేసే సాంప్రదాయ కోడి పందేలు, పొట్టేలు పందాలు, ఎడ్ల పందేలు వీక్షించేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. టోల్ గేట్ల వద్ద రద్దీని సత్వరమే తగ్గించేందుకు ఫాస్టాగ్ అమలు సహా ప్రత్యేకంగా అదనపు కౌంటర్లను ఏర్పాటు చేశారు.