హైదరాబాద్ నుంచి కంచికచర్ల వైపు వస్తున్న కారు ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ను ఢీకొని రహదారిపై అడ్డం తిరిగింది. హైదరాబాద్ నుండి వస్తున్న మరో కారు వెనకనుండి ఢీ కొనడంతో మూడు వాహనాలకు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. రోడ్డుపై వాహనాలు ఉండటంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వాహన రాకపోకలను నియంత్రించారు.
కంచికచర్ల వద్ద రోడ్డు ప్రమాదం.. ముగ్గురికి గాయాలు - kanchikacherla
కృష్ణాజిల్లా కంచికచర్ల చెరువుకట్ట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు, ట్రాక్టర్ ఢీకొన్నాయి. ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి.
రోడ్డుప్రమాదం