ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాలుగు వాహనాలు ఢీ...నలుగురికి స్వల్పగాయాలు - విజయవాడ

కృష్ణాజిల్లా నందిగామ వద్ద పెను ప్రమాదం తృటిలో తప్పింది.  నాలుగు వాహనాలు ఢీకొన్న ఘటనలో నలుగురు వ్యక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

నాలుగు వాహనాలు ఢీ...నలుగురికి స్వల్పగాయాలు

By

Published : Aug 5, 2019, 1:24 AM IST

కృష్ణా జిల్లాలోని నందిగామ రైతుపేట వద్ద ప్రమాదం తప్పింది. విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వచ్చిన ద్విచక్రవాహనాన్ని తప్పించే క్రమంలో డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. ఆ వెనువెంటనే బస్సును వెనక ఉన్న లారీ ఢీకొట్టింది. ఈ క్రమంలో దాని వెనుక ఉన్న మరో లారీ ముందు ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో వాహనాల డ్రైవర్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బస్సులో ఉన్న ప్రయాణికులు ఎటువంటి గాయాలు కాలేదని స్థానికులు తెలిపారు.

నాలుగు వాహనాలు ఢీ...నలుగురికి స్వల్పగాయాలు

ABOUT THE AUTHOR

...view details