కృష్ణా జిల్లా నూజివీడు మండలం సీతారాంపురం గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని, లారీ ఢీ కొన్న ఘటనలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన నాగేంద్ర ప్రసాద్ మృతి చెందాడు. నాగేంద్ర ప్రసాద్ ఎనిమిది నెలలుగా బాపులపాడు మండలం మల్లవల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్ వద్ద వీ సీ మోటార్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఇంఛార్జీగా విధులు నిర్వహిస్తున్నాడు. ఇతను హనుమాన్ జంక్షన్ వైపు వెళ్తుండగా రైస్ మిల్ సమీపంలో ఎదురుగా వస్తోన్న లారీ ఢీ కొంది. ఘటనలో తలకు బలమైన గాయం కావడం వల్ల నాగేంద్రప్రసాద్ అక్కడికక్కడే చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని నూజివీడు ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ద్విచక్రవాహనాన్ని ఢీ కొన్న లారీ... ఒకరు మృతి - nuziveedu latest accident
కృష్ణా జిల్లా సీతారాంపురంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొన్న ఘటనలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి మృతి చెందాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నూజివీడులో రోడ్డు ప్రమాదం... ఒకరు మృతి