కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం పేరకలపాడు వద్ద జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనదారున్ని కారు ఢీ కొట్టింది. ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని 108 వాహనంలో నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతివేగంగా వచ్చిన కారు.. డివైడర్‌ను ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించటంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు.
బైకును ఢీకొన్న కారు.. ముగ్గురికి గాయాలు - kanchikacherla
కృష్ణా జిల్లా పేరకలపాడు వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టింది.
రోడ్డుప్రమాదం