ప్రతి ఒక్కరికి సమానమైన విద్య అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్య రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ ను ఏర్పాటు చేసిందని జస్టిస్ ఈశ్వరయ్య వెల్లడించారు. కమిటీ ఛైర్ పర్సన్ గా ఆయన విజయవాడలో బాధ్యతలు స్వీకరించారు. డిగ్రీ నుంచి పీజీ వరకు ప్రతి కళాశాలలో నాణ్యమైన విద్య అందించే దిశగా ఎప్పటికప్పుడు కళాశాలలను తనిఖీ చేస్తూ.. లోపాలను సరిదిద్దుతామన్నారు. ఇంజినీరింగ్, వైద్య విద్య వంటి వాటిపైనే కాకుండా సాధారణ డిగ్రీ కళాశాలల్లో సైతం సమస్యలను పరిష్కరించేందుకు త్వరలోనే కమిషన్ విధి విధానాలు ఖరారు చేస్తామని చెప్పారు.
జస్టిస్ ఈశ్వరయ్య చేతికి ఏపీహెచ్ఈఆర్ఎంసీ బాధ్యతలు - Received the duties of Justice Eshwarayya as Chairperson of APHERMC
రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత విద్య రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిటీ ఛైర్ పర్సన్‌గా జస్టిస్ ఈశ్వరయ్య బాధ్యతలు స్వీకరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉన్నత విద్యకు సంబంధించిన కమిషన్ రాష్ట్రంలో ఉందని ఆనందం వ్యక్తంచేశారు.
vijayawada latest
TAGGED:
vijayawada latest