బయటపడిన రేషన్ బియ్యం అక్రమ దందా - vigilence
కృష్ణా జిల్లా షేర్ మహమ్మద్ పేటలో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. స్థానికంగా మోడల్ కాలనీలో రేషన్ బియ్యం అక్రమ దందా బయట పడింది.
![బయటపడిన రేషన్ బియ్యం అక్రమ దందా](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3347669-852-3347669-1558489789046.jpg)
రేషన్ బియ్యం
బయటపడిన రేషన్ బియ్యం అక్రమ దందా
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్ పేటలో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఎథేచ్ఛగా కొనసాగుతున్న అక్రమ రవాణా గురించి తెలుసుకున్న అధికారులు మెరుపు దాడులు చేసి 48 సంచుల 24 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని, కారును స్వాధీనం చేసుకున్నారు. చిల్లకల్లు ఏఎస్సై కేసు నమోదు చేసుకుని నిందితుడు పగిడిపతి రామకృష్ణగా గుర్తించినట్టు తెలియజేశారు.