రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నప్పటికీ పెద్దగా ఫలితాలు కనిపించడం లేదు. తాజాగా 10 టన్నుల బియ్యాన్ని చిల్లకల్లు వద్ద పట్టుకున్నారు.
రేషన్
By
Published : May 17, 2019, 1:28 PM IST
రేషన్ పట్టివేత
విజయవాడ జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు వద్ద అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. వీటిని ఖమ్మం నుంచి కాకినాడ తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. లారీలో 10 టన్నుల బియ్యం ఉన్నట్లు గుర్తించారు. వాహనాన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు... కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.