అరుదైన శస్త్ర చికిత్సకు కృష్ణా జిల్లా విజయవాడ ఆంధ్ర ఆసుపత్రి మరోసారి వేదికైంది. వైద్య రంగంలో గుండె సంబంధిత విభాగంలో ఒక విప్లవాత్మక మార్పుకి ఆంధ్ర హాస్పిటల్ నాంది పలికిందని ఇంట్రవెన్షనల్ కార్డియాలజిస్ట్ చీఫ్ డా.శ్రీమన్నారాయణ వివరించారు. కార్డియోజనిక్ షాక్తో తమ ఆసుపత్రిలో చేరిన 80 ఏళ్ల బేబీ సరోజిని అనే వృద్ధురాలికి సర్జికల్ అయేరిక్ట్ వాల్వ్ రీప్లేస్మెంట్ ప్రక్రియ ద్వారా చికిత్స అందించామని చెప్పారు. వ్యాధికారకమైన కవాటాన్ని తొలగించి... కొత్త కవాటాన్ని అమర్చామని వివరించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం మెరుగుపడిందని... తక్కువ సమయంలోనే డిశ్చార్జ్ చేశామని చెప్పారు.
అరుదైన శస్త్ర చికిత్సకు వేదికైన విజయవాడ ఆంధ్ర ఆసుపత్రి - అరుదైన శస్త్ర చికిత్సకు వేదికైన విజయవాడ ఆంధ్ర ఆసుపత్రి
ఎనభై ఏళ్ల బేబీ సరోజిని అనే వృద్ధురాలి గుండెకు సంబంధించి అరుదైన శస్త్ర చికిత్స చేసి... వైద్యరంగంలోనే నూతన మార్పుకి శ్రీకారం చుట్టామని ఆంధ్ర ఆసుపత్రి ఇంట్రవెన్షనల్ కార్డియాలజిస్ట్ చీఫ్ డా.శ్రీమన్నారాయణ అన్నారు.
అరుదైన శస్త్ర చికిత్సకు వేదికైన విజయవాడ ఆంధ్ర ఆసుపత్రి