ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

TOLLYWOOD DRUGS CASE: రానా ఈడీ విచారణ.. కెల్విన్​తో లావాదేవీలపై ఆరా - ముగిసి రానా విచారణ

Tollywood drug case
Tollywood drug case

By

Published : Sep 8, 2021, 6:42 PM IST

Updated : Sep 8, 2021, 8:51 PM IST

18:40 September 08

Rana Daggubati

టాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తోన్న డ్రగ్స్​ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌-ఈడీ (Enforcement Directorate) విచారణ కొనసాగుతోంది. డ్రగ్స్ విక్రేత కెల్విన్‌తోపాటు సినీ ప్రముఖులు పూరీ, ఛార్మి, రకుల్‌, నందులను విచారించిన అధికారులు వారి వద్ద నుంచి కీలకమైన విషయాలు రాబట్టినట్లు సమాచారం. విచారణలో భాగంగా ఈ కథానాయకుడు రానా దగ్గుబాటి ఈడీ విచారణకు హాజరయ్యారు. ఆయనను 7 గంటల పాటు విచారించారు. మరోసారి ఈడీ కార్యాలయానికి ప్రధాన నిందితుడు కెల్విన్‌ను పిలిపించారు.  

కెల్విన్​ ఎవరో తెలీదు.. 

మనీలాండరింగ్ కేసు(MONEY LAUNDERING)లో ఈడీ నోటీసులు అందుకున్న రానా... విచారణకు హాజరయ్యారు . రానా బ్యాంకు ఖాతాలను పరిశీలించిన అధికారులు... కెల్విన్‌తో లావాదేవీలపై ఆరా తీశారు. తనకు కెల్విన్​ ఎవరో తెలియదని రానా చెప్పినట్లు సమాచారం. అయితే మనీ లాండరింగ్‌ కోణంలో రానా బ్యాంకు ఖాతాలను కూడా అధికారులు పరిశీలించి.. అనుమానాస్పద లావాదేవీల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎఫ్‌ క్లబ్ విషయమై రానాను పలు ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది.  

వివరాల సేకరణ..

ఇప్పటికే డ్రగ్స్ కేసులో మనీలాండరింగ్​కు సంబంధించిన వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న ఈడీ అధికారులు... మత్తుమందు సరఫరాదారులు కెల్విన్, వాహిద్​తో పాటు మరో వ్యక్తిని మంగళవారం ప్రశ్నించారు. ఈ రోజు మళ్లీ 8 గంటలుగా కెల్విన్, వాహీద్‌ను అధికారులు ప్రశ్నించారు. ఇద్దరి బ్యాంక్ లావాదేవీలకు సంబంధించి వివరాలు సేకరించారు. రేపు మరోసారి విచారించే అవకాశం ఉంది. 

గురువారం రవితేజ..!

గురువారం ఈడీ విచారణకు సినీ నటుడు రవితేజ, ఆయన డ్రైవర్ శ్రీనివాస్ హాజరయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే సినీ ప్రముఖులు పూరీ జగన్నాథ్​, ఛార్మి, రకుల్​, నందులను విచారించిన అధికారులు.. వారి వద్ద నుంచి కీలక విషయాలు రాబట్టినట్లు సమాచారం.

విచారణ ముమ్మరం..

 సంచలనం సృష్టించిన ఈ కేసులో విచారణను ఈడీ అధికారులు ముమ్మరం చేశారు. ఆగస్టు 31న సుమారు 10 గంటలపాటు డైరెక్టర్​ పూరీ జగన్నాథ్​ను విచారించారు. ఆర్థిక లావాదేవీలపైనే ప్రధానంగా దృష్టి సారించిన ఈడీ అధికారులు.. పూరీ బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన వివరాలను సేకరించారు. పూరీ జగన్నాథ్, తన చార్టెడ్ అకౌంటెంట్​తో కలిసి ఈడీ అధికారుల ఎదుట హాజరయ్యారు. బ్యాంకు లావాదేవీలతో పాటు.. ఇతర ఆర్థిక విషయాలను ఈడీ అధికారులు ప్రశ్నించగా.. చార్టెడ్ అకౌంటెంట్ సాయంతో పూరీ జగన్నాథ్ సమాధానం ఇచ్చారు.  

కెల్విన్‌తో వాట్సప్‌ ఛాటింగ్‌ చేశారా?  

ఈనెల 2న నటి ఛార్మి ఈడీ విచారణకు హాజరయ్యారు. సుమారు 8 గంటలపాటు ఈడీ సంయుక్త సంచాలకుడు అభిషేక్‌ గోయల్‌ నేతృత్వంలోని బృందం ఛార్మిని విచారించింది. అనుమానాస్పద బ్యాంకు లావాదేవీలపై ఆరా తీశారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. మాదకద్రవ్యాల సరఫరాదారు కెల్విన్‌తో గల సంబంధాల గురించి అధికారులు ఆరా తీశారు. మాదకద్రవ్యాల కొనుగోలు నిమిత్తం కెల్విన్‌కు డబ్బు ఇచ్చారా? అని ప్రశ్నించారు. కెల్విన్‌తో ఫోన్‌ సంభాషణలు, వాట్సప్‌ ఛాటింగ్‌ చేశారా? అని అడిగారు. ఆన్‌లైన్‌లో అతడి ఖాతాకు డబ్బు పంపించారా? అని ఆరా తీశారు. దాదా పేరుతో ఉన్న ఫోన్‌ నంబరుకు కాల్స్‌ చేశారా? అని ప్రశ్నించారు. అయితే కెల్విన్‌ గురించి తనకేమీ తెలియదని.. అతడితో తనెలాంటి లావాదేవీలు జరపలేదని ఛార్మి బదులిచ్చినట్లు తెలిసింది. దర్శకుడు పూరి జగన్నాథ్‌తో ఛార్మి వ్యాపార లావాదేవీలు కలిగి ఉండటంతో వాటి గురించీ ఆరా తీసినట్లు సమాచారం. అవసరమైతే మరోసారి విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని అధికారులు ఆమెకు చెప్పినట్లు సమాచారం.  

6 గంటలపాటు రకుల్​ విచారణ..

ఈనెల 3న ప్రముఖ నటి రకుల్​ప్రీత్​ సింగ్​ను ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ అధికారులు దాదాపు 6 గంటలపాటు విచారించారు. మనీ లాండరింగ్‌ కోణంలో రకుల్​ బ్యాంక్‌ ఖాతాలను ఈడీ అధికారులు పరిశీలించారు. అనుమానాస్పద లావాదేవీల గురించి అడిగి తెలుసుకున్నారు. రకుల్​ వ్యక్తిగత లావాదేవీలపైనా ఈడీ అధికారులు ఆరా తీసినట్లు సమాచారం. దిల్లీ, ముంబయిలో ఉన్న రకుల్ ఖాతాల్లో జరిగిన లావాదేవీలు, యూపీఐ లావాదేవీలపై ప్రశ్నించారు. మత్తుమందు సరఫరాదారుడు కెల్విన్ తెలుసా.. అని ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నకు అతనెవరో తెలియదని రకుల్ సమాధానమిచ్చినట్లు సమాచారం. అయితే సిట్​ దర్యాప్తులో రకుల్​ ప్రీత్​ సింగ్ పేరు లేదు. ఎఫ్‌ క్లబ్‌ నుంచి డ్రగ్స్‌ సరఫరా అయినట్లు కెల్వీన్‌ ఇచ్చిన సమాచారంతో రకుల్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది.  

7 గంటలపాటు నందు విచారణ..

ఈనెల 7న.. మనీలాండరింగ్ కేసులో ఈడీ అధికారులు సినీ నటుడు నందుతో పాటు మత్తు మందుల సరఫరాదారు కెల్విన్​ను ప్రశ్నించారు. దాదాపు 7 గంటల పాటు నందును ప్రశ్నించిన ఈడీ అధికారులు... బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వివరాలను సేకరించారు. అందులో అనుమానాస్పద లావాదేవీల గురించి అడిగి వివరాలను తెలుసుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈడీ కార్యాలయానికి కెల్విన్, వాహబ్, కుద్దూస్​లను తీసుకొచ్చారు. ఉదయం 5 గంటల సమయంలో ఈడీ అధికారులు కెల్విన్, వాహబ్, కుద్దూస్ ఇంటికి వెళ్లారు. ఇళ్లల్లో తనిఖీలు నిర్వహించిన అనంతరం ముగ్గురిని కార్యాలయానికి తీసుకొచ్చారు. ముగ్గురి బ్యాంకు లావాదేవీలను పరిశీలించారు. వీళ్ల ఖాతాల్లోకి ఇతరుల ఖాతాల నుంచి భారీగా డబ్బు వచ్చినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనే వివరాలను ఈడీ అధికారులు అడిగి తెలుసుకున్నారు.  

మాదక  కెల్విన్‌ను 6 గంటలపాటు ప్రశ్నించారు. ఎక్సైజ్ సిట్ అధికారుల దర్యాప్తు కూడా కెల్విన్ కేంద్రంగానే నడిచింది. 2017 జూలై నెలలో కెల్విన్​ను ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేసి రూ.30 లక్షల విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అతని చరవాణిలో ఉన్న నెంబర్ల ఆధారంగా దర్యాప్తు నిర్వహించారు.  

ఇదీ అసలు కథ..

నాలుగేళ్ల క్రితం హైదరాబాద్‌లో ఎక్సైజ్‌ అధికారులకు చిక్కిన కొందరు డ్రగ్స్‌ విక్రేతల విచారణలో పలువురు సినీ ప్రముఖుల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. సినీ ప్రముఖులను ఎక్సైజ్‌ అధికారులు సుదీర్ఘంగా విచారణ జరిపారు. రక్తం, గోళ్లు, వెంట్రుకల శాంపిల్స్‌ సేకరించి పరీక్షలకు పంపించారు. అయితే, సినీ ప్రముఖులకు క్లీన్‌చీట్‌ ఇచ్చిన ఎక్సైజ్‌ అధికారులు.. పలువురు డ్రగ్స్‌ విక్రేతలపై 12 ఛార్జిషీట్లు దాఖలు చేశారు.

ఇదీ చదవండి

chavithi celebrations: వినాయక చవితి ఉత్సవాలకు హైకోర్టు గ్రీన్​ సిగ్నల్

Last Updated : Sep 8, 2021, 8:51 PM IST

ABOUT THE AUTHOR

...view details