ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రూ. 40 లక్షల 79 వేలు విలువైన ఆభరణాలు స్వాధీనం

By

Published : Feb 28, 2021, 12:59 PM IST

తెలంగాణలోని ఖమ్మం జిల్లా వైరా పట్టణంలో ఎలక్ట్రికల్ దుకాణం యజమాని ఇంట్లో దోపిడికి పాల్పడ్డ రాజస్థాన్ ముఠాను.. కృష్ణా జిల్లా నందిగామ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 40 లక్షల 79వేలు విలువైన నగదు, బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు నందిగామ డీఎస్పీ నాగేశ్వర్ రెడ్డి వెల్లడించారు.

theft gang arrested by nandigana police
ఎలక్ట్రికల్ షాపు యజమాని ఇంట్లో దోపిడ్డ రాజస్థాన్ ముఠా అరెస్టు

కృష్ణా జిల్లా నందిగామ మండలం జొన్నలగడ్డ చెక్​పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో తెలంగాణలోని ఖమ్మం జిల్లా వైరాలో ఓ ఎలక్ట్రికల్ షాపు యజమాని ఇంట్లో చోరీకి పాల్పడ్డ ఇద్దరిని అరెస్టు చేసినట్లు నందిగామ డీఎస్పీ నాగేశ్వర్ రెడ్డి వెల్లడించారు. నిందితులు రాజస్థాన్​కు చెందిన దినేశ్ సింగ్, ఇన్సాఫ్ మహమ్మద్​గా గుర్తించగా...​ వైరాలోని ఓ దుకాణంలో పనిచేస్తున్న దయాలాల్ కు సైతం ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు తెలిపారు.

'వైరా పట్టణం ద్వారకా నగర్​లోని ఎలక్ట్రికల్ షాపు యజమాని దళపతి సింగ్. ఈ నెల 26 రాత్రి ఆయన ఇంట్లోకి చోరబడ్డ ఇద్దరు ఆయన్ను కొట్టి.. కట్టిపడేశారు. సుమారు రూ. 35.61 లక్షల నగదు, బంగారం, వెండి అభరణాలతో పరారయ్యారు. నిందితులు అదేరోజు ఆటోలో నందిగామ వస్తుండగా జొన్నలగడ్డ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నగదు, బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ. 40 లక్షల 79వేలు ఉంటుంది'.-నాగేశ్వర్ రెడ్డి, నందిగామ డీఎస్పీ.

ఈ కేసుకు సంబంధించి నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించారని.. కానిస్టేబుల్ రాజప్పను డీఎస్పీ అభినందించారు.

ఇదీ చూడండి:

సాంకేతికతలో ఏపీ పోలీసు శాఖకు 4 అవార్డులు

ABOUT THE AUTHOR

...view details