కొత్త రైల్వే లైన్‌కు రంగం సిద్ధం
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విశాఖపట్నం నుంచి రాయనపాడు మీదుగా సికింద్రాబాద్ వెళ్లేందుకు కొత్త రైల్వే లైన్ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి భూసేకరణలో భాగంగా కొండపావులూరు సమీపంలోని రైల్వే ట్రాక్ సమీపంలో నూజివీడు సబ్ కలెక్టర్ స్వప్నిల్ దినకరన్, డిప్యుటీ చీఫ్ ఇంజనీర్‌తో కలిసి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు.
విశాఖపట్నం- విజయవాడ- సికింద్రాబాద్ నగరాల మధ్య లో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కొత్త రైల్వే లైన్ ఏర్పాటుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. విజయవాడ శివారులోని ముస్తాబాద్ రైల్వే స్టేషన్ నుంచి గుణదల, రాయనపాడు మీదుగా నేరుగా సికింద్రాబాద్ వెళ్లే ఎక్స్ ప్రెస్ రైల్వే లైన్ ఏర్పాటు చేస్తున్నారు. రూరల్ కొండపావులూరు సమీపంలోని రైల్వే ట్రాక్ సమీపంలో నూజివీడు సబ్ కలెక్టర్ స్వప్నిల్ దినకరన్, డిప్యుటీ చీఫ్ ఇంజనీర్ కలిసి... భూములు కోల్పోతున్న రైతులతో కలిసి రైల్వే లైన్ భూసేకరణ ఇతర అంశాలపై చర్చించి.. ఆప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం సబ్ కలెక్టర్ విశాఖపట్నం నుంచి రాయనపాడు మీదుగా సికింద్రాబాద్ వెళ్లేందుకు మూడవ లైన్ ఏర్పాటు చేయడానికి రైతుల నుంచి భూములను సేకరించి ప్రక్రియ మొదలు పెట్టామని... దీనివల్ల రైల్వే రద్దీ తగ్గి త్వరగా సికింద్రాబాద్ కు చేరుకునే అవకాశం ఉంటుందని సబ్ కలెక్టర్ దినకర్ అన్నారు.