వైకాపా నాయకుల కుట్రల ఫలితంగా ఇసుక కొరత ఏర్పడిందని తెదేపా నాయకులు వ్యాఖ్యానించారు. కృష్ణా జిల్లా నందిగామలో ఇసుక కొరతపై నిరాహార దీక్ష చేపట్టారు. మాజీ ఎమ్మెల్యేలు తంగిరాల సౌమ్య, శ్రీరాం తాతయ్య పాల్గొన్నారు. భవన నిర్మాణానికి కావల్సిన ఇసుకను అందకుండా చేయడంవల్లే కార్మికులకు పనులు లేకుండాపోయాయని ఆవేదన చెందారు. వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నిరసన చేపట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందని అభిప్రాయపడ్డారు.
ఇసుక కొరతపై తెదేపా నేతల నిరసన - వైకాపా
ఇసుక కొరత... వైకాపా ప్రభుత్వం కుట్రల ఫలితంగానే ఏర్పండిందని తెదేపా నాయకులు అన్నారు. భవన నిర్మాణ కార్మికులకు పని లేకుండా చేశారంటూ కృష్ణా జిల్లా నందిగామలో నిసరన చేపట్టారు.
ఇసుక కొరతపై తెదేపా నేతల నిరసన దీక్ష..