ఆయిల్ పాం ఓ.ఈ.ఆర్ ధరల్లో వ్యత్యాసం కారణంగా రాష్ట్ర రైతులు నష్టపోతున్నారని ఆయిల్ పాం రైతు ప్రతినిధులు స్పష్టం చేశారు. ఓ.ఈ.ఆర్ ధరల చెల్లింపుల్లో తెలంగాణకు, ఏపీకి వ్యత్యాసం ఉండటం వల్ల ఈ నష్టాల్ని ఎదుర్కోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర సచివాలయంలో వ్యవసాయ మంత్రి కన్నబాబుతో పాటు సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వం స్పందించి రూ.84 కోట్లు విడుదల చేయడంపై ధన్యవాదాలు తెలిపారు.
మంత్రి కన్నబాబుకు వినతి పత్రం అందజేత - విజయవాడలో నిరసన
ఆయిల్ పాం ధరల్లో వ్యత్యాసంతో రైతులు నష్టపోతున్నారని ఆయిల్‌పాం రైతులు ఆందోళన చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రాష్ట్ర మంత్రి కన్నబాబుకు వినతి పత్రం అందించారు.
రైతుల కష్టాల గురించి మాట్లాడుతున్న రైతు ప్రతినిధులు