ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వాస్పత్రిలో గర్భిణి మృతి.. బంధువుల ఆందోళన

ప్రసవం కోసం వచ్చిన మహిళ మరణంతో విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఆమె మరణానికి ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు ఆందోళనకు దిగారు.

పురిటి మహిళ మరణం.. విజయవాడ ప్రభుత్వాసుపత్రి వద్ద ఉద్రిక్తత

By

Published : Jul 18, 2019, 2:08 PM IST

ప్రభుత్వాస్పత్రిలో గర్భిణి మృతి..వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువుల ఆందోళన

విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రికి ప్రసవం కోసం వచ్చిన మహిళ సహా పురిటి బిడ్డ మృతి చెందటంతో ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చిన్నమ్మ అనే మహిళ ప్రసవం కోసం ఈనెల 16న ప్రభుత్వాసుపత్రిలో చేరింది. ఈ రోజు ఉదయం పురిటిబిడ్డతోపాటు చిన్నమ్మ మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే తన భార్య, బాబు మృతి చెందారని చిన్నమ్మ భర్త రాజు ఆరోపించాడు. మృతదేహాలను మార్చురీకి తరలిస్తుండగా అడ్డుకుని.. ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగాడు. మృతికి గల కారణాలు అడిగినా.. వైద్యులు చెప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి మృతురాలి భర్తను సముదాయించే ప్రయత్నం చేశారు. ప్రతి పనికి ఆసుపత్రి సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారనీ.. వైద్యులు సరిగా పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

ABOUT THE AUTHOR

...view details