కృష్ణా జిల్లాలో ఎన్నికల వేడి పుంజుకుందు. పార్టీ నేతలు ఎన్నికల ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ఉంగుటూరు మండలంలో ప్రచారం చేపట్టారు. వేమండ, ఇందుప్లలీ, నందమూరు, మధిరపాడు గ్రామాలను సందర్శించారు. అన్ని గ్రామాల్లో డ్రైయినేజీ నిర్మించి స్వచ్ఛగ్రామాలుగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు కల్పస్తామన్నారు. సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు.
తిరువూర నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి , సిట్టింగ్ ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణ నిధి ప్రచారం ముమ్మరం చేశారు. మరోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వైకాపా అధినేత జగన్ ప్రకటించిన నవరత్నాలను ప్రజలకు వివరించారు.
నూజివీడు నియోజకవర్గంలో తెదేపా ప్రచార వేగాన్ని పెంచింది. తెదేపా అభ్యర్థి ముద్రబోయిన వెంకటేశ్వరరావు, ఏలూరు ఎంపీ అభ్యర్థి మాగంటి వెంకటేశ్వరరావు కలిసి ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం తమను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
కృష్ణాలో ప్రచారాల హోరు - pracharam
కృష్ణా జిల్లాలో ఎన్నికల వేడి పుంజుకుందు. పార్టీ నేతలు ఎన్నికల ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ఉంగుటూరు మండలంలో ప్రచారం చేపట్టారు. తిరువూర నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి , సిట్టింగ్ ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణ నిధి ప్రచారం ముమ్మరం చేశారు
కృష్ణాలో ప్రచారాల హోరు
ఇదీ చదవండి