తూర్పుగోదావరి జిల్లా ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో ఎలక్ట్రానిక్స్ విభాగానికి చెందిన విద్యార్థి కౌశిక్... 99.23 శాతం మార్కులతో పాలిటెక్నిక్‌లో రాష్ట్ర స్థాయిలో ప్రథమస్థానంలో నిలిచాడు. అతడిని రెండు బంగారు పతకాలతో పాటు 20 వేల నగదు ప్రోత్సహకంతో కళాశాల యాజమాన్యం ఘనంగా సత్కరించింది. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు పాలిటెక్నిక్ కళాశాలలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి మాట్లాడుతూ.. పట్టుదల, క్రమశిక్షణ, సాధించాలనే తపనే తనకు విజయాన్ని సాధించిపెట్టిందన్నాడు.
పట్టుదలతో చదివాడు... బంగారు పతకాలు సాధించాడు - GOLD MEDALS
చదువుకోవాలనే తపన.. సాధించాలనే పట్టుదల.. నడవడికలో క్రమశిక్షణ వెరసి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కౌశిక్‌ను పాలిటెక్నిక్‌లో రాష్ట్రస్థాయిలో ప్రథమస్థానంలో నిలిచేలా చేశాయి. ఈ సందర్భంగా విద్యార్థిని కళాశాల యాజమాన్యం రెండు బంగారు పతకాలతో కౌశిక్‌ను ఘనంగా సత్కరించింది.
విద్యార్ఖికి బంగారు పతకం