ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆస్పత్రిలోనే మృతదేహం.. పోలీసుల తీరుతో బాధిత కుటుంబంలో ఆవేదన!

రెండు రాష్ట్రాల పోలీసు శాఖల నిబంధనలు ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపాయి. కృష్ణా జిల్లాకు చెందిన కాకి వీరాంజనేయులు ఒడిశాలో లారీ నుంచి జారి పడి తీవ్రంగా గాయపడ్డాడు. గుంటూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రమాదం జరిగిన, మృతి చెందిన ప్రాంతాలు వేర్వేరు అయిన కారణంగా... మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు పోలీసులు ముందుకు వెళ్లట్లేదు.

By

Published : Jun 3, 2021, 6:57 AM IST

ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపిన రెండు రాష్ట్రాల పోలీసుశాఖల నిబంధనలు
ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపిన రెండు రాష్ట్రాల పోలీసుశాఖల నిబంధనలు

రెండు రాష్ట్రాల పోలీసు శాఖల నిబంధనలు ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపాయి. కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం కొత్త మాజేరు గ్రామానికి చెందిన కాకి వీరాంజనేయులు లారీ క్లీనర్‌గా పని చేసేవాడు.గత నెల 27న ఒడిశాలోని చిములియా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ప్రయాణిస్తుండగా లారీ నుంచి జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

ప్రమాదం జరిగిన, మృతి చెందిన ప్రాంతాలు వేర్వేరు కావటంతో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు పోలీసులు ముందుకు రావట్లేదు. 4 రోజులుగా మృతదేహాన్ని అప్పగించాలని గుంటూరు జిల్లా కొత్తపేట స్టేషన్‌ పోలీసులను వీరాంజనేయులు కుటుంబసభ్యులు వేడుకుంటున్నారు. వారు స్పందించకపోతే న్యాయపోరాటానికి సిద్ధమవుతామని మాలమహానాడు నేతలు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details