పొలం కొనుగోలు నిమిత్తం బీరువాలో దాచిన డబ్బును... మనవడే చోరీ చేసిన కేసును కృష్ణా జిల్లా కంచికచర్ల పోలీసులు ఛేదించారు. స్థానిక వసంత కాలనీలో జానీ బాషా అనే వ్యక్తి పొలం కొనుగోలు నిమిత్తం 10 లక్షల సొమ్మును బీరువాలో దాచి ఉంచాడు. విషయాన్ని గమనించిన మనవడు మహ్మద్.. బీరువా తాళం పగలగొట్టి నగదును దొంగతనం చేశాడు. విలువైన సెల్ ఫోన్, క్రికెట్ పై ఉన్న మక్కువతో క్రికెట్ కిట్ కొనుగోలు చేశాడు. అనుమానించిన పోలీసులు అతని నుంచి 9 లక్షల 61 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు నందిగామ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ తెలిపారు. క్రికెట్ పై ఉన్న మక్కువతోనే అకాడమీలో చేరేందుకే దొంగతనం చేసినట్లు నిందితుడు మహ్మద్ ఒప్పుకున్నట్టు పోలీసులు తెలిపారు. అతడిని కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు.
క్రికెట్‌పై ప్రేమతో.. తాత సొమ్ము చోరీ చేసిన మనవడు - kanchikacherla
కృష్ణా జిల్లా కంచికచర్లలోని వసంతకాలనీలో ఓ రైతు ఇంట్లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు.
చోరీ