ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెనమకూరు స్టేట్ బ్యాంక్​లో చోరీ.. ఐదు గంటల్లో ఛేదించిన పోలీసులు - కృష్ణా జిల్లా తాజా వార్తలు

కృష్ణా జిల్లా పెనమకూరులోని స్టేట్ బ్యాంకులో చోరీ జరిగింది. ఈ కేసును పోలీసులు కేవలం ఐదు గంటల్లో ఛేదించి నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ. 21,175 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ విజయపాల్​ వెల్లడించారు.

police crack Penamakuru State Bank robbery case
స్టేట్ బ్యాంకులో చోరీ కేసులో నిందితుడు అరెస్టు

By

Published : Jul 1, 2021, 10:19 PM IST

కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం పెనమకూరు స్టేట్ బ్యాంకులో చోరీ జరిగింది. ఈ కేసుని పోలీసులు ఐదు గంటల్లోనే ఛేదించారు. నిందితుడు కనపర్తి అఖిల్​ను అరెస్టు చేసి రూ. 21,175 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ విజయ పాల్​ వెల్లడించారు. అఖిల్​పై గతంలో దేవాలయాలు, చిన్న దుకాణాల్లో చోరీలు చేసినట్లు పలు కేసులు ఉన్నట్లు డీసీపీ పేర్కొన్నారు.

విద్యుత్ బిల్లు ఎక్కువగా వస్తుందని బ్యాంకులో సీసీ కెమెరాలు, లైట్లు, అలారం ఆపడంతో చోరీ జరిగిన తీరు సీసీ కెమెరాల్లో రికార్డు కాలేదని డీసీపీ తెలిపారు. అయితే నిందితుడు పలుమార్లు బ్యాంకులో సంచరించినట్లు తెలియడంతో అదుపులోకి తీసుకొని విచారించగా చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడని తెలిపారు. ఫిర్యాదు అందిన 5 గంటల్లోనే కేసును ఛేదించినట్లు డీసీపీ తెలిపారు.

నిందితున్ని పట్టుకున్న సిబ్బందిని ఆయన అభినందించారు. బ్యాంకుల్లో నిరంతరం సీసీ కెమెరాలు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు డీసీపీ చూసించారు.

ఇదీచదవండి:జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details