ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Perni Nani On Cinema Tickets: సినిమా టికెట్ల వ్యవహారం తప్ప ఇంకేం లేదా?: పేర్ని నాని - పేర్ని నాని

కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం లింగవరం రోడ్డులోని కె కన్వెన్షన్‌ ఆవరణలో ఎన్టీఆర్‌ టు వైఎస్‌ఆర్‌ ట్రస్టు ఆధ్వర్యంలో జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు పోటీలను నిర్వహిస్తున్నారు. తొలిరోజు విజేతలకు బహుమతి ప్రదాన కార్యక్రమంలో మంత్రి పేర్ని నాని పాల్గొన్నారు. విలేకరులు సినిమా టికెట్ల ధరలపై ప్రశ్నించగా.. మీడియాకు సినిమా టికెట్ల విషయం తప్ప వేరే ఏమీ లేవా అంటూ తిరిగి ప్రశ్నించారు.

perni nani on ticket price
perni nani on ticket price

By

Published : Jan 12, 2022, 7:26 AM IST

సినిమా టికెట్ల వ్యవహారం తప్ప ఇంకేం లేదా? : పేర్ని నాని

Cinema Tickets Issue: సినిమా టికెట్ల విషయం తప్ప రాష్ట్రంలో మీడియాకు వేరే పనేం లేకుండా పోయిందని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని అన్నారు. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం లింగవరం రోడ్డులోని కె కన్వెన్షన్‌ ఆవరణలో ఎన్టీఆర్‌ టు వైఎస్‌ఆర్‌ ట్రస్టు ఆధ్వర్యంలో జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు పోటీలను నిర్వహిస్తున్నారు. మంగళవారం రాత్రి పోటీల తొలి రోజు విజేతలకు బహుమతి ప్రదాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పేదల సంక్షేమానికి పాటుపడిన మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీఆర్‌, వైఎస్‌ఆర్‌ల పేరిట పోటీలను పెద్దఎత్తున నిర్వహించడం అభినందనీయమన్నారు. పశుసంపద, సంప్రదాయ క్రీడలను ప్రోత్సహించేలా మంత్రి కొడాలి నాని సోదరులు అయిదేళ్లుగా పోటీలు నిర్వహిస్తుండడం ప్రశంసనీయమన్నారు.

విలేకరులు సినిమా టికెట్ల ధరలపై ప్రశ్నించగా.. ప్రజలు, వ్యవస్థలకు అవసరమైన విషయాలపై మీడియా స్పందిస్తే సమాజానికి మేలు జరుగుతుందని మంత్రి పేర్ని నాని అన్నారు. మీడియాకు సినిమా టికెట్ల విషయం తప్ప వేరే ఏమీ లేవా అంటూ ప్రశ్నించారు.

రెండు పాలపళ్ల ఎద్దుల విభాగం పోటీల్లో విజేతలకు మంత్రి పేర్ని నాని నగదు బహుమతులు, జ్ఞాపికలు అందజేశారు. మంత్రి కొడాలి నాని సోదరుడు కొడాలి చిన్ని, వైకాపా నాయకులు దుక్కిపాటి శశిభూషణ్‌, పాలేటి చంటి, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

PAWAN KALYAN ON ALLIANCES: 'పొత్తులపై ఎవరి మైండ్ గేమ్‌లోను పావులు కావొద్దు'

ABOUT THE AUTHOR

...view details