క్రిస్మస్ పర్వదినం సందర్భంగా... తెలుగు రాష్ట్రాల్లోని క్రైస్తవులకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. విపత్కర పరిస్థితుల నుంచి మానవాళి బయటపడేలా ప్రార్థనలు చేయాలని కోరారు. ధర్మాన్ని ఆచరించేవారికి ధైర్యం మెండుగా ఉంటుందనేందుకు ఏసు క్రీస్తు జీవితం ఒక ఉదాహరణ అని అన్నారు. ధర్మం కోసం పెద్దలను ప్రశ్నించి శిలువ ఎక్కారని, ఏ దశలోనూ భయపడకుండా తన సువార్తను ఎంతో సహనంతో, సాహసంతో ప్రవచించారని కొనియాడారు. క్షమ, కరుణ, ప్రేమ, త్యాగం అనేవి మానవ జీవితానికి అవసరమని.. వాటిని పాటించాలని చెప్పిన క్రీస్తు బోధనలను అందరూ ఆచరించాలని పవన్ కోరారు.
తెలుగు రాష్ట్రాల ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన పవన్ - janasena president pawan kalyan
ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని క్రైస్తవులకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ధర్మాన్ని ఆచరించేందుకు జీసస్ క్రైస్ట్ శిలువ ఎక్కారని అన్నారు. కరోనా మహమ్మారి నుంచి మానవాళిని బయటపడేలా క్రిస్ట్మస్ ప్రార్థనలు చేయాలని కోరారు.
తెలుగు రాష్ట్రాల క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన పవన్