కైకలూరు సభలో పవన్ కల్యాణ్ రాయలసీమను కొందరు నేతలు రక్తాల సీమగా చేశారని కృష్ణా జిల్లా కైకలూరులో నిర్వహించిన బహిరంగ సభలోపవన్ మండిపడ్డారు. పులివెందుల కుటుంబాలపాలన నుంచి విముక్తి కోసం యువత ఎదురు చూస్తోందని అన్నారు. జగన్, చంద్రబాబు తప్పా మరెవరూ రాజకీయాలు చేయకూడదా అని ప్రశ్నించారు. ఈ పద్ధతిని మార్చి పాత కోటలను బద్ధలు కొట్టి కొత్త రాజకీయాలు తీసుకువస్తానని అని ధీమా వ్యక్తం చేశారు. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోనని స్పష్టం చేశారు. పులివెందుల వేషాలు తన వద్ద వేస్తే ఊరుకునేది లేదన్నారు. సొంత పేపర్లు, ఛానళ్లు ఉన్నాయని పిచ్చివేషాలు వేయొద్దని హెచ్చరించారు.