ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వరస్వామి వారికి పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. శ్రావణ శుద్ధ త్రయోదశి నుంచి శ్రావణ బహుళ పాఢ్యమి వరకు మూడు రోజుల పాటు ఈ వేడుకలు నిర్వహిస్తారు. 14వ తేదీ ఉదయం అమ్మవారికి అభ్యంగనస్నానం, స్నపనాభిషేకం నిర్వహిస్తారు. అనంతరం అమ్మవారిని అలంకరించి... 108పోగులు కలిగిన పట్టు పవిత్రాలను ధారణ చేస్తారు. 15వ తేదీన పవిత్రాల విసర్జన కార్యక్రమం చేసి... 16వ తేదీ శ్రావణ బహుళ పాడ్యమి రోజున మహాపూర్ణాహుతితో పవిత్రోత్సవాలు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఈ మూడు రోజులు పాటు ఇంద్రకీలాద్రిపై ఆర్జిత సేవలను రద్దు చేశారు. తిరిగి 17వ తేదీ నుంచి ఆలయంలో ఆర్జిత సేవలు నిర్వహించనున్నారు.
ఇంద్రకీలాద్రిపై పవిత్రోత్సవాలు ప్రారంభం - pavitrotsavalu
ఇంద్రకీలాద్రిపై పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. కనకదుర్గమ్మ వారి వైభవాన్ని చూసి తరించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.
ఇంద్రకీలాద్రి