ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏపీ టు తెలంగాణ ప్రయాణం.. అయోమయం ఇంకెంతకాలం? - తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీబస్సుల వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సులు తిరగకపోవటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో హైదరాబాద్​కు వెళ్లాలన్నా....అటు నుంచి ఏపీకి రావాలన్న చాలా వ్యయప్రయాసలు పడుతున్నామని వాపోతున్నారు. విజయవాడ గరికపాడు చెక్ పోస్ట్ వరకు ఏపీ బస్సులు వస్తున్నాయి. అక్కడి నుంచి కిలోమీటర్ దూరం ఆటోలో ప్రయాణించి రామాపురం చేరుకోవాలి. అక్కడి నుంచి తెలంగాణ ఆర్టీసీ బస్సులో హైదరాబాద్​కు వెళ్లాల్సిన పరిస్థితి ఉందని ఆవేదవ వ్యక్తం చేస్తున్నారు. ఇరు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు సమన్వయం చేసుకొని హైదరాబాద్ విజయవాడ మధ్య నేరుగా బస్సులు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.

సరిహద్దుల్లో ప్రయాణికుల ఇక్కట్లు
సరిహద్దుల్లో ప్రయాణికుల ఇక్కట్లు

By

Published : Nov 1, 2020, 2:20 PM IST

Updated : Nov 1, 2020, 2:39 PM IST

ఆంధ్ర, తెలంగాణ ఆర్టీసీ అధికారుల్లో నెలకొన్న గందరగోళం ప్రయాణికుల పాలిట శాపంగా మారింది. విజయవాడ నుంచి హైదరాబాద్ కు ప్రయాణాలు సాగించే వారు ఇరు రాష్ట్రాల సరిహద్దు గరికపాడు చెక్ పోస్ట్ వద్ద తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత రాష్ట్రం నుంచి హైదరాబాద్​కు నేరుగా బస్సులు నడపని విషయం తెలిసిందే. ఫలితంగా.. ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ నుంచి గరికపాడు చెక్ పోస్ట్ వరకు... తెలంగాణ ఆర్టీసీ రామాపురం వరకు బస్సులు నడుపుతున్నారు.

ఈ ఇరు గ్రామాల మధ్య కిలోమీటర్ దూరం ఎటువంటి బస్సులు నడపక పోవటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. పైగా ఆటోలకు ఎక్కువ ఛార్జీలు అవుతున్నాయని వాపోతున్నారు. ఇరు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు సమన్వయం చేసుకొని హైదరాబాద్ విజయవాడ మధ్య నేరుగా బస్సులు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.

ఇవీ చదవండి:

రాజధాని గ్రామాల్లో ప్రశాంతంగా కొనసాగుతున్న బంద్

Last Updated : Nov 1, 2020, 2:39 PM IST

ABOUT THE AUTHOR

...view details