అన్ని ప్రభుత్వ శాఖల్లోలానే తమ శాఖలోనూ పదోన్నతులు, సర్వీస్ క్రమబద్ధీకరణలు చేపట్టాలని పంచాయతీ రాజ్ శాఖ ఉద్యోగులు కోరారు. తిరుపతిలో పంచాయతీ రాజ్ శాఖ జోనల్ సభ్యులు సమావేశాన్ని నిర్వహించారు. ఎమ్మార్ పల్లిలోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో సభ్యులు మాట్లాడారు.రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకున్న గ్రామ సచివాలయాల ఏర్పాటు నిర్ణయంతో తమ శాఖలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకున్నాయని తెలిపారు.తమ ఉద్యోగాలకు భరోసా కల్పిస్తూ...ఎన్నో ఏళ్లుగా పదోన్నతులు లేకుండా విధులు నిర్వహిస్తున్న వారికి పదోన్నతులు కల్పించాలని కోరారు.
"మాకూ ఉద్యోగ భద్రత కల్పించండి..." - thirupathi
తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని పంచాయతీ రాజ్ శాఖ ఉద్యోగులు కోరారు. గ్రామ సచివాలయాల ఏర్పాటుతో తమ భవిష్యత్తు అంధకారంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
మాకూ ఉద్యోగ భద్రత కల్పించండి!
TAGGED:
thirupathi