ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మోపిదేవి ఆలయంలో ప్రత్యక్ష పూజలకు అవకాశం - శ్రీవల్లి, దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానము

కృష్ణాజిల్లా, మోపిదేవిలోని శ్రీవల్లి, దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంలో ఇకపై ప్రత్యక్ష పూజలు చేసుకోవచ్చు. ఆగస్టు ఒకటో తేది నుంచి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆలయ అధికారులు తెలిపారు. కానీ, కొన్ని పూజలు, సేవలకు మాత్రమే ప్రత్యేక్షంగా చేసుకునే అనుమతిని ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

krishna distrct
మోపిదేవి ఆలయంలో ప్రత్యక్ష పూజలకు అవకాశం

By

Published : Jul 31, 2020, 11:25 AM IST

కృష్ణాజిల్లా, మోపిదేవి మండలం, మోపిదేవి గ్రామంలో శ్రీవల్లి, దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానములో భక్తులు ఆగస్టు నెల ఒకటవ తేది నుంచి సేవలు/పూజలు ప్రత్యక్షముగా లేక పరోక్షముగా జరిపించవచ్చు.

పూర్తి వివరాలు ఇలా...

ప్రత్యేకముగా వచ్చి నిత్య కళ్యాణము - కాల సర్పదోష నివారణపూజ, ఊంజల సేవ , అభిషేకం, గోపూజ, వాహన పూజ, నాగశిలల ప్రతిష్ట తక్కువ సంఖ్యలో భక్తులు స్వయంగా చేయించుకోవచ్చని ఆలయ అధికారలు తెలిపారు.

పరోక్షంగా అయితే నిత్య కళ్యాణము - మహోన్యాస పూర్వక రుద్రాభి షేకము, కాల సర్పదోష నివారణ పూజ , సహస్ర నామార్చన, స్వర్ణ బిల్వార్చన, ఊంజల సేవ , అభిషేకం, అష్టోత్తర నామార్చన, గోపూజ చేయించుకోవచ్చు. సంబదిత రుసుము ఆన్ లైన్ ద్వారా దేవస్థానం ఎకౌంటునకు నగదు చెల్లించి సేవలు పొందవచ్చునని ఆలయ సహాయ కమీషనర్, కార్యనిర్వహణాధికారి జి.వి.డి.ఎన్.లీలాకుమార్ తెలిపారు.

వివరాలకు ల్యాండ్ నెంబరు 08671257240 ను సంప్రదించాలని తెలిపారు. 10 సంవత్సరాలలోపు చిన్నారులకు 65 సంవత్సరాలు పైబడిన వారికి ఆలయంలోకి అనుమతి లేదని తెలిపారు.

ఇదీ చదవండిఇ - కర్షక్ పంట నమోదు ప్రక్రియ వేగవంతం

ABOUT THE AUTHOR

...view details