తమిళనాడులోని వల్లూరు, కర్ణాటకలోని కుడ్గి థర్మల్ కేంద్రాలతో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల(పీపీఏ)ను గౌరవించాల్సిందేనని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎన్‌టీపీసీ ట్రాన్స్‌కోకు ఇటీవల లేఖరాసింది. యూనిట్ వ్యయం ఎక్కువగా ఉందని పీపీఏ నుంచి తప్పుకోవాలన్న డిస్కంల ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్లు పేర్కొంది. కుడ్గి స్టేజ్-1 కింద 800 మెగావాట్ల సామర్థ్యమున్న 3 ప్లాంట్ల(మొత్తం 2,400 మె.వా) నుంచి విద్యుత్ తీసుకోవటానికి డిస్కంలు 2010 సెప్టెంబరు 23న పీపీఏలు చేసుకున్నాయి. వల్లూరులో ఒక్కొక్కటి 500మెగావాట్ల సామర్థ్యమున్న మూడు విద్యుత్ ప్లాంట్ల(మొత్తం 1,500 మె.వా) నుంచి విద్యుత్ కొనుగోలుకు 2008 పిబ్రవరి 20న పీపీఏలను కుదుర్చుకున్నాయి. తర్వాత కర్నూలులోని గని, అనంతపురంలోని ఎన్‌పీకుంట సౌర విద్యుత్ ప్రాజెక్టుల నుంచి విద్యుత్ తీసుకోవటానికి వీలుగా బండిల్డ్‌పవర్ కింద ఎన్‌టీపీసీతో పీపీఏలను డిస్కంలు చేసుకున్నాయి. బండిల్డ్‌పవర్‌లో భాగంగా కుడ్గి నుంచి 385, వల్లూరు నుంచి 88 మెగావాట్లను ఎన్‌టీపీసీ అదనంగా కేటాయించింది. స్థిర, చర ఛార్జీలు కలిపి యూనిట్‌కు రూ.10వరకు వెచ్చించాల్సి వస్తోందని, ప్రస్తుతం డిస్కంలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా అధికధర వెచ్చించి కొనుగోలుచేయలేని పరిస్థితి ఉందని ట్రాన్స్‌కో పేర్కొంది. రిజర్వు షట్‌డౌన్‌లో ఉన్న సమయంలో విద్యుత్ అవసరాల కోసం బహిరంగమార్కెట్ నుంచి అధికధరకు విద్యుత్ కొనుగోలు చేయాల్సివస్తోందని, రెండు విద్యుదుత్పత్తి సంస్థలతో కుదుర్చుకున్న పీపీఏలను ఉపసంహరించటానికి అవకాశం కల్పించాలని కోరుతూ ఏపీట్రాన్స్‌కో అధికారులు కేంద్ర ఇంధనశాఖకు లేఖరాశారు. పీపీఏలను ఉపసంహరించటం సాధ్యం కాదంటూ ఎన్‌టీపీసీ లేఖ రాసిందని ట్రాన్స్‌కో సీఎండీ శ్రీకాంత్ తెలిపారు.
వల్లూరు, కుడ్గి పీపీఏల రద్దు కుదరదు! - ఎన్‌టీపీసీ వార్తలు
తమిళనాడులోని వల్లూరు, కర్ణాటకలోని కుడ్గి థర్మల్ కేంద్రాలతో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల(పీపీఏ)ను పసంహరించటం సాధ్యం కాదంటూ కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎన్‌టీపీసీ ట్రాన్స్‌కోకు లేఖరాసింది. యూనిట్‌కు అధిక ధర వెచ్చించి కొనాల్సి వస్తోందని అందుకే.. పీపీఏలను ఉపసంహరించటానికి అవకాశం కల్పించాలని కోరుతూ ఏపీట్రాన్స్‌కో అధికారులు ఇదివరకే కేంద్ర ఇంధనశాఖకు విన్నవించుకున్నారు.
ట్రాన్స్‌కోకు ఎన్‌టీపీసీ లేఖ