ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కృష్ణాలో నామినేషన్ల ప్రవాహం - మైలవరం

కృష్ణా జిల్లాలో ప్రధాన పార్టీల సార్వత్రిక ఎన్నికల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అభ్యర్థుల నామపత్రాలను సీసీ కెమేరాల పర్యవేక్షణలో ఎన్నికల అధికారులు స్వీకరిస్తున్నారు.

కృష్ణా జిల్లాలో నామినేషన్ల ప్రవాహం

By

Published : Mar 22, 2019, 3:14 AM IST

కృష్ణా జిల్లాలో నామినేషన్ల ప్రవాహం


కృష్ణా జిల్లాలో ప్రధాన పార్టీల సార్వత్రిక ఎన్నికల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. తెదేపా అభ్యర్థులు భారీ ర్యాలీలతో ప్రచారంగా వెళ్లారు. గుడివాడలో దేవినేని అవినాశ్.. ఎడ్లబండిపై తరలివెళ్లి రిటర్నింగ్ అధికారికి నామపత్రాలు అందించారు. మైలవరం నుంచి దేవినేని ఉమ... తిరువూరులో కేఎస్ జవహర్ నామినేషన్ల ఘట్టం పూర్తి చేశారు. అవనిగడ్డలో మండలి బుద్ధప్రసాద్ నామినేషన్ వేశారు. మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర కలెక్టరుకు నామపత్రాలు అందించారు.

వైకాపా, జనసేన అభ్యర్థులూ..!

వైకాపా అభ్యర్థులూ హంగూ ఆర్భాటాలతో నామపత్రాలు దాఖలు చేశారు. విజయవాడ సెంట్రల్ అభ్యర్థి మల్లాది విష్ణు , మైలవరంలో వైకాపా అభ్యర్థి వసంతకృష్ణప్రసాద్‌, అవనిగడ్డలో సింహాద్రి రమేశ్ బాబు తమ నామినేషన్లు వేశారు. అవనిగడ్డ జనసేన అభ్యర్థి ముత్తంశెట్టి కృష్ణారావు ఈ రోజే నామినేషన్ వేయనున్నారు.

పారదర్శకంగా...

అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియను పారదర్శకంగా, ప్రశాంతంగా పూర్తి చేసేందుకు ఎన్నికల అధికారులు చర్యలు తీసుకున్నారు. కార్యాలయాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ కెమేరాల పర్యవేక్షణలో అభ్యర్థుల నామపత్రాలు స్వీకరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:ఐదేళ్లలో బెజవాడ అభివృద్ధిపై పుస్తకం

ABOUT THE AUTHOR

...view details