ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సైకిల్ స్పీడ్​కు.. ఎవరూ తట్టుకోలేరు: చంద్రబాబు - chandra babu

మామగారి నియోజకవర్గమైన పామర్రును కుప్పం తరహాలో అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో సైకిల్ వేగానికి ఎవరూ తట్టుకోలేరన్నారు.

చంద్రబాబు

By

Published : Apr 8, 2019, 8:25 PM IST

చంద్రబాబు ఎన్నికల ప్రచారం

గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలకంటే ఎక్కువ అభివృద్ధే చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన.. రాష్ట్రంలో తెదేపా గాలి వీస్తోందన్నారు. సైకిల్ స్పీడ్​కు ఎవరూ తట్టుకోలేరని వ్యాఖ్యానించారు. మోదీ అన్ని వ్యవస్థలనూ.. నాశనం చేశారని ఎవరెన్ని కుట్రలు పన్నినా.. రాష్ట్రాభివృద్ధి ఆపలేరన్నారు. పోలవరాన్ని వ్యతిరేకించే కేసీఆర్​తో జగన్ జతకట్టారని మండిపడ్డారు. తన మామగారి నియోజకవర్గమైన పామర్రును కుప్పంలా అభివృద్ధి చేస్తామన్నారు. బ్రహ్మాండమైన ఆర్థిక వ్యవస్థకు శ్రీకారం చూట్టి మెువ్వలో 100 కోట్లతో కూచిపూడి కళాక్షేత్రం నిర్మిస్తామన్నారు. రైతులకు 12 గంటల ఉచిత కరెంట్ ఇస్తామని హామీ ఇచ్చారు. 250 కోట్లతో చేనేత మార్కెట్ నిధి ఏర్పాటు చేస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details