రాష్ట్రంలో విగ్రహాల దాడుల వెనుక ఎవరు ఉన్నా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. పోలీస్ వ్యవస్థకు వైకాపా ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. తెలుగుదేశం, భాజపా ఒత్తిళ్లకు డీజీపీ తలొగ్గాల్సిన అవసరం లేదని చెప్పారు. ఆలయాల్లో దాడులపై రాజకీయ ప్రమేయం ఉందని చెప్పిన డీజీపీని కొందరు బెదిరిస్తున్నారని... వాటిని పోలీసులు తీవ్రంగా పరిగణించాలని నాని సూచించారు. రాష్ట్రంలో భాజపాను ప్రజలు నమ్మరన్న మంత్రి... సోము వీర్రాజు రథయాత్రను పట్టించుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో భాజపా ఆటలు సాగవు: మంత్రి కొడాలి నాని - DGP gowtham sawang news
పోలీస్ వ్యవస్థకు వైకాపా ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. తెలుగుదేశం, భాజపా ఒత్తిళ్లకు డీజీపీ తలొగ్గాల్సిన అవసరం లేదని చెప్పారు. రాష్ట్రంలో భాజపా ఆటలు సాగవని అన్నారు.
kodali nani