ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిరుద్యోగులకు శుభవార్త... శాసనసభలో కొత్త బిల్లు ‍‌

నిరుద్యోగ యువతకు పరిశ్రమల్లోనే స్థానికంగా ఉపాధి లభించేందుకు ఉద్దేశించిన బిల్లుకు శాసనసభ ఆమోదముద్ర వేసింది. ప్రస్తుత పరిశ్రమలతోపాటు కొత్తగా ఏర్పాటయ్యే వాటిలో స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఈ బిల్లు ఉపకరించనుంది.

నిరుద్యోగులకు శుభవార్త... శాసనసభలో కొత్త బిల్లు ‍‌

By

Published : Jul 25, 2019, 5:57 AM IST

Updated : Jul 25, 2019, 6:27 AM IST

పరిశ్రమల్లో స్థానిక యువతకు 75 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, కర్మాగారాల స్థానిక అభ్యర్ధుల ఉపాధి బిల్లును శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే.. పరిశ్రమల్లోని ఉద్యోగాలు 75శాతం స్థానికులకే లభించేలా ప్రభుత్వం దీనికి రూపకల్పన చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిశ్రమలు, కర్మాగారాలు, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య సంస్థలు, ఇలా వేర్వేరు సంస్థల్లోని ఉద్యోగాల్లో స్థానిక యువతకే ప్రాధాన్యత దక్కనుంది. స్థానికంగా అర్హత కలిగిన అభ్యర్ధులు లభ్యం కాకపోతే ...నైపుణ్య శిక్షణ ఇచ్చిమరీ ఉపాధి కల్పించాలని బిల్లులో పేర్కొన్నారు. దీని ద్వారా 10 లక్షల మందికి పైగా యువతకు ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

స్థానికులకు శుభవార్త...

స్థానిక యువతకు ఉపాధి ఉండాలనే ఈ బిల్లును తీసుకొచ్చామని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేస్తున్నారు. పరిశ్రమలు, కర్మాగారాల్లో స్థానిక యువతకు రిజర్వేషన్ల కల్పించే ఈ బిల్లు చరిత్రాత్మకం అవుతుందని అన్నారు.ఈ బిల్లు ద్వారా పరిశ్రమలకు ఆహ్వానం పలికేందుకు స్థానికులు ముందుంటారని స్పష్టం చేస్తోంది. సులభతర వాణిజ్యం, ఖనిజాలు, మౌలిక సదుపాయాలు, ఓడరేవులు, లాజిస్టిక్ పార్కులకు దీని వల్ల అనుకూలత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

బిల్లులో ముఖ్యాంశాలివే...

  • ‍‌పరిశ్రమలు, కర్మాగారాల స్థానిక అభ్యర్ధుల ఉపాధి బిల్లుకు ఆమోద ముద్ర పడింది.
  • స్థానిక యువతకు 75 శాతం రిజర్వేషన్‌ కల్పించేలా బిల్లు ఉంది.
  • బిల్లును ఏకగ్రీవంగా శాసనసభ ఆమోదించింది.
  • పరిశ్రమలతో పాటు కొత్తగా ఏర్పాటయ్యే వాటిలో ఉపాధి కల్పిస్తారు.
  • పీపీపీ సంస్థలకు మాత్రమే వర్తింపజేసేలా నిర్ణయించారు.

ఇదీ చూడండిఉత్తరాది​లో పిడుగుల వర్షం - 51 మంది మృతి

Last Updated : Jul 25, 2019, 6:27 AM IST

ABOUT THE AUTHOR

...view details