ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు

ఆరోగ్యమే మహా భాగ్యం.. రసాయనాలు లేని వ్యవసాయమే మేలంటున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. తాతల కాలం నాటి ఆరోగ్యాలు కావాలంటే ప్రకృతి, గో ఆధారిత సేద్యమే చేయాలని కృష్ణా జిల్లా మొవ్వ గ్రామంలో అవగాహన కల్పించే దిశగా సదస్సు నిర్వహించారు.

Nature farming Awareness seminar
ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు

By

Published : Nov 2, 2020, 11:14 AM IST


మనం తీసుకునే ఆహారం బట్టే మన ఆరోగ్యం ఉంటుందని జగమెరిగిన సత్యం. అందుకే అనారోగ్యం వచ్చాక వైద్యుని దగ్గరకు వెళ్లేకంటే.. ముందుగా ప్రకృతి వ్యవసాయం చేసే రైతు వద్దకు వెళితే ఆరోగ్యాన్ని కాపాడే ఉత్పత్తులు పండించి ఇస్తాడని ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వరితోపాటుగా కూరగాయలు, పండ్లు ఎలా పండించాలి, సాగును ఎలా లాభసాటిగా మలుచుకోవాలనే అంశాలపై కృష్ణా జిల్లా మొవ్వ గ్రామంలో అవగాహన కల్పించే దిశగా సదస్సు నిర్వహించారు.

రసాయనిక ఎరువులపై ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీలను.... ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు ఇచ్చి ప్రోత్సహించాలని భారతీయ కిసాన్ సంఘ్ నేత కుమారస్వామి విజ్ఞప్తి చేశారు. సేంద్రియ ఉత్పత్తులను రైతులు లాభసాటిగా అమ్ముకునే విధంగా ప్రభుత్వం మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తే రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేస్తారని రైతులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి...

గంజాయి మత్తు...యువత చిత్తు

ABOUT THE AUTHOR

...view details