NGT stay: చిత్తూరు జిల్లాలో రిజర్వాయర్ల పనులు నిలిపివేయాలని ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. అవులపల్లితో పాటు 3 రిజర్వాయర్ల పనులు నిలిపివేయాలని తెలిపింది. ఈ పనులకు సంబంధించి పర్యావరణ అనుమతులు తప్పకుండా తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. పర్యావరణ అంచనా వేయకుండా ఎలా చేపట్టారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తాగునీటి అవసరంతోపాటు పర్యావరణ పరిరక్షణ అంతే అవసరమని వ్యాఖ్యానించింది. పర్యావరణానికి నష్టం వాటిల్లదన్న ఏపీ వాదనలను తోసిపుచ్చింది. పర్యావరణ అనుమతులు పొందాకే ప్రాజెక్టులు ప్రారంభించాలని ఎన్జీటీ ఆదేశించింది.
NGT: ఏపీలోని ఆ మూడు రిజర్వాయర్ల పనులు నిలిపివేయాలి: ఎన్జీటీ - ఏపీలోని ఆ మూడు రిజర్వాయర్లకు ఎన్జీటీ బ్రేక్
14:44 February 14
పర్యావరణ అనుమతులు తప్పకుండా తీసుకోవాల్సిందేనన్న ఎన్జీటీ
గాలేరు-నగరి, హంద్రీ-నీవా ప్రాజెక్టులో భాగంగా అదనంగా ఏపీ సర్కార్ ఈ మూడు రిజర్వాయర్ల నిర్మాణాన్ని చేపట్టిందని ఏపీ ప్రభుత్వం తెలిపింది. గతంలో అనుమతులు పొందిన ప్రాజెక్టుల విస్తరణలో భాగంగానే రిజర్వాయర్లని ఎన్జీటీ దృష్టికి తీసుకవచ్చింది. కొత్త రిజర్వాయర్ల నిర్మాణం వల్ల పర్యావరణ ముప్పు ఉండదని వాదించింది. ఇందుకు స్పందించిన ఎన్టీటీ.. పర్యావరణ ప్రభావం అంచనా వేయకుండా ముప్పు ఉండదని ఎలా చెబుతారని ప్రశించింది. పర్యావరణ అనుమతుల తర్వాతే నిర్మాణం చేపట్టాలని తేల్చి చెప్పింది.
ఇదీ చదవండి
Special Status: ప్రత్యేక హోదా లేదు.. నిధుల సమీకరణకు కృషి చేయండి: భాజపా ఎంపీ జీవీఎల్