ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సర్కార్ అసమర్థ విధానాలతో సంక్షోభంలో చేనేత రంగం' - nara lokesh letter to cm jagan

చేనేత కార్మికులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. రద్దు చేసిన రాయితీలు, పథకాలను తిరిగి ప్రవేశపెట్టాలన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్​కు ఆయన లేఖ రాశారు.

nara lokesh
నారా లోకేశ్

By

Published : Sep 21, 2020, 5:06 PM IST

రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ విధానాలతో చేనేత రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. సంక్షోభంలో ఉన్న చేనేత రంగాన్ని ఆదుకోవాలంటూ ముఖ్యమంత్రి జగన్​కు నారా లోకేశ్ సోమవారం లేఖ రాశారు. నేతన్నలకు తెదేపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలను వైకాపా ప్రభుత్వం రద్దు చేయడం వల్ల చేనేత ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుందని లేఖలో పేర్కొన్నారు. రాయితీలు, ప్రోత్సాహకాలు నిలిపివేత, ఆప్కో ద్వారా కొనుగోళ్లు లేకపోవటంతో చేనేత కార్మికుల బతుకు దినదిన గండంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు..

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్బాటంగా ప్రవేశపెట్టిన నేతన్న నేస్తం పథకం కనీసం 10 శాతం మందికి కూడా అందటం లేదు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆప్కో ద్వారా కొనుగోళ్లు నిలిచిపోయి కోట్ల రూపాయిల విలువ చేసే ఉత్పత్తులు నేతన్నల వద్దే పేరుకుపోయాయి. దీనివల్ల తయారీ ఆగిపోయి చేనేత రంగంపై ఆధారపడిన వారికి ఉపాధి దొరకని పరిస్థితి ఏర్పడింది. ఒక పక్క కరోనా కష్టాలు మరోపక్క ప్రభుత్వ నిబంధనలతో నేతన్నకు కనీస సహాయం అందడం లేదు. సొంతంగా మగ్గం ఏర్పాటు చేసుకోవడానికి ప్రతి నేతన్నకి 1.5 లక్షల సబ్సిడీ రుణాన్ని ప్రభుత్వం అందజేయాలి. ఎత్తేసిన సంక్షేమ కార్యక్రమాలు, రాయితీలు, ప్రోత్సాహకాలు తిరిగి అమలు చేసి చేనేత రంగాన్ని ఆదుకోవాలి- నారా లోకేశ్, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి

ABOUT THE AUTHOR

...view details