తన తాత ఆస్తిలాగా 15 వేల కోట్ల బాక్సైట్‌ను సీఎం జగన్, తన తమ్ముళ్లకి రాసిచ్చారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. బంధువుల్ని రాబందుల్లా మన్యం పైకి వదిలి ముఖ్యమంత్రి వేడుక చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వ్ ఫారెస్ట్‌లో లాటరైట్ ముసుగులో బాక్సైట్ తరలించటాన్ని తెదేపా బయటపెట్టిందన్నారు.
విక్రాంత్ రెడ్డి, అనిల్ రెడ్డి మైనింగ్ మాఫియా కార్యకలాపాలు తెదేపా బయటపెట్టిందనే కోపంతోనే సీనియర్ నేతల్ని అక్రమంగా అరెస్టు చేయిస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే బాక్సైట్ మైనింగ్ నిలిపివేసి.. పర్యావరణాన్ని, గిరిజనుల హక్కులను కాపాడాలని లోకేశ్ డిమాండ్ చేశారు.