కృష్ణా జిల్లా నందిగామలో మంగళవారం నుంచి కర్ఫ్యూ ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 23 నుంచి... ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే వర్తక, వాణిజ్య సంస్థలు తెరిచి ఉండాలని స్పష్టం చేశారు. అత్యవసరమైతే తప్ప ఎవ్వరూ రోడ్లపైకి రాకూడదని కోరారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి భౌతికదూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ ధ్యానచంద్, ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు ఇతర మండలాల ఎమ్మార్వోలతో అత్యవసర సమావేశం నిర్వహించారు.
నందిగామలో మంగళవారం నుంచి లాక్డౌన్..! - నందిగామ లాక్డౌన్ తాజా వార్తలు
నందిగామలో మంగళవారం నుంచి మధ్యాహ్నం 2 గంటల తరవాత కర్ఫ్యూ విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సబ్ కలెక్టర్ ధ్యాన చంద్ తెలిపారు.
మంగళవారం నుంచి నందిగామలో లాక్డౌన్